![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. (Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -257 లొ...... రామలక్ష్మి గదిలో ఉంటుంది. సీతాకాంత్ వచ్చి నేలపైన పడుకుంటాడు. అదేంటి అలా పడుకుంటున్నారని రామలక్ష్మి అంటుంది. నీకు నాపై ప్రేమ ఉందనుకున్న ఇదంతా ఆస్తుల కోసమని అంటాడు. రామలక్ష్మి కూడా నేలపైన పడుకుంటుంది. ఇక్కడ నుండి కూడా పొమ్మంటావా అంటూ చిరాకుగా మాట్లాడేసరికి.. రామలక్ష్మి వెళ్లి బెడ్ పై పడుకుంటుంది.
ఆ తర్వాత ఆస్తులు నా పేరున రాసుకొని మిమ్మల్ని కాపాడుకున్నా కానీ మిమ్మల్ని గెలవడంలో ఓడిపోయానని రామలక్ష్మి బాధపడుతుంది. మరొకవైపు రామలక్ష్మి ఇంత మోసం చేసింది. నాపై చెయ్ ఎత్తిన కూడా సీతాకాంత్ తనని క్షమించాడంటే అది అంటే వాడికి ఎంత ఇష్టమో అర్ధమైంది. ఇప్పుడు రామలక్ష్మిపై కోపంగా ఉన్నాడు. ఇప్పుడే నందినికి ఫోన్ చేసి సీతాకాంత్ ని తనవైపుకి తిప్పుకునేలా చేయాలని శ్రీలత నందినికి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత, సందీప్ లకి శ్రీవల్లి కాఫీ తీసుకొని వస్తుంది కానీ రామలక్ష్మి రాగానే ఆ కాఫీలని తీసుకొని వెళ్లి రామలక్ష్మికి ఇస్తుంది.
మీరు ఇక ఈ ఇంట్లో ఉండాలన్న ఆస్తులు మీ పేరున రాయలన్న కూడా ఇంట్లో పనులు అంత చెయ్యాలని చెప్తుంది. వాళ్ళని బట్టలు ఉత్తకమంటుంది వాళ్ళకి పనిమనిషిలు వేసుకునే బట్టలు వేసుకోమంటుంది. వాళ్లు పనిమనుషుల్లా అన్ని పనులు చేస్తుంటారు. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ కి ఆఫీస్ కి వెళ్ళడానికి అని సిద్ధం చేస్తుంటే సీతాకాంత్ చిరాకుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |